07-09-2025 03:08:59 PM
సనత్‌నగర్, (విజయక్రాంతి): హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయని పీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ తెలిపారు. తొమ్మిది రోజులపాటు భక్తులు గణనాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి ఘన వీడ్కోలు పలికారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గణేష్ ఉత్సవాలపై సీఎం రేవంత్ రెడ్డి, ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర మంత్రులు ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. ఇందులో భాగంగా ప్రభుత్వం గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ పంపిణీ చేసిందన్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సైతం నేరుగా ట్యాంక్ బండ్ వెళ్లి గణేష్ నిమజ్జనాల ప్రక్రియను స్వయంగా పరిశీలించారని తెలిపారు.
ఏ మాత్రం హంగు, అర్భాటం లేకుండా సామాన్యుడిలా ట్యాంక్ బండ్ కు వెళ్లి భక్తులతో మమేకమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త చరిత్ర లిఖించారన్నారు. ఇంకోవైపు తొమ్మిది రోజులపాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, అత్యంత భక్తి శ్రద్ధలతో గణేశ్ శోభాయాత్ర ప్రశాంతంగా సాగడంలో అహర్నిశలు పనిచేసిన పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, రవాణా, పంచాయతీ రాజ్ ఇతర శాఖల అధికారులు, సిబ్బందికి, ఉత్సవ కమిటీల సభ్యులు, మండపాల నిర్వాహకులు, క్రేన్ ఆపరేటర్లు, భక్తులు అందరికీ అభినందనలు తెలిపారు. హైదరాబాద్ నగరంలో లక్షలాది గణేశ్ విగ్రహాలు క్రమపద్ధతిలో నిర్దేశిత సమయానికి ట్యాంక్‌బండ్‌తో సహా మిగతా అన్ని ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమం సాఫీగా, ప్రశాంతంగా సాగడానికి సహకరించిన ప్రజలకు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.