30-07-2024 05:42:12 PM
న్యూఢిల్లీ: లోక్ సభలో కేంద్ర బడ్జెట్ పై చర్చ జరుగుతుంది. ప్రతిపక్షలు అడిగిన ప్రశ్నిలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం చెబుతున్నారు. వరుసగా మూడోసారి ఎన్డీయేకు అధికారం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీతారామన్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీపై ప్రజలు మరోసారి విశ్వాసం ఉంచి అధికారం ఇచ్చారని, స్థిరత్వం, ప్రజా శ్రేయస్సు విధానాలను తీసుకువస్తున్నామన్నారు. వికాసిత్ భారత్ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం అని సీతారామన్ తెలిపారు.
నైపుణ్య శిక్షణ, విద్య రంగానికి బడ్జెట్ లో అధికంగా కేటాయించామని, భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అన్నారు. గత ఏడాదితో పోలిస్తే తాజా బడ్జెట్ లో ఏ రంగానికి తక్కువ కేటాయింపులు చేయలేదని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ స్ఫూర్తితో బడ్జెట్ ప్రవేశపెట్టామన్నారు. 2009-10 బడ్జెట్ లో బిహార్, యూపీకి అధికంగా కేటాయించారు. రెండు రాష్ట్రాలపై ఆరోపణలు చేస్తున్నవారు దానికేం జవాబిస్తారు..? అని ఆమె ప్రశ్నించారు. 2009-10 బడ్జెట్ లో 26 రాష్ట్రాల ప్రస్తామనే నాటి బడ్జెట్ లో పెట్టలేదని, 2010-11 బడ్జెట్ లో 19 రాష్ట్రాలు, 2011-12 బడ్జెట్ లో 15 రాష్ట్రాలను విస్మసించారు.