31 July, 2026 | 8:21 PM

Breaking News

దమ్మపేట గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక గ్రామసభ   •   ఎస్‌ఐఆర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   ఎమ్మెల్యే చొరవతో బాలాజీ నగర్ ప్రమాదకర గుంతలో మట్టి నింపివేత   •   రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు   •   ముస్లిం హక్కుల పోరాట సమితి అధ్యక్షుడిగా ఖాజా భక్ష్   •   పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రలో పాల్గొన్న మాజీ ఎంఎల్ఏలు   •   కరీంనగర్‌లో ఘనంగా పోలీసు అధికారుల పదవీ విరమణ సన్మానం   •   ఇల్లందుకు మరో ఆర్‌ఐని తక్షణమే నియమించాలి: పీడీఎస్‌యూ   •   నీట మునిగిన పంటలను పరిశీలించిన డీఏవో   •   మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన ఎంపీడీఓ   •  

స్థానిక ఎన్నికలను హైకోర్టు అడ్డుకోవడం బాధాకరం

10-10-2025 12:52 AM

బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయ నాయుడు

హుజూర్ నగర్, అక్టోబర్ 9 : స్థానిక సంస్థల ఎన్నికలను తాత్కాలికంగా హైకోర్టు స్టే విధించడం అత్యంత బాధాకరమని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు అన్నారు.

గురువారం పట్టణంలోని బీసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు...గత అనేక దశాబ్దాలుగా బీసీలకు సరైన రాజకీయ ప్రాధాన్యత లేని గ్రహించి బీసీ సంఘాలు చేసిన అసమాన పోరాటాల వల్ల దిగివచ్చిన రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ కేటాయిస్తూ బిల్లు ఆమోదించి గవర్నర్కు రాష్ట్రపతికి ఆమోదల కోసం పంపితే అట్టి బిల్లును గత ఆరు నెలలుగా తొక్కి పట్టి బిల్లు ఆమోదం పొందకుండా షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చకుండా బిజెపి పార్టీ బీసీలకు తీరని అన్యాయం చేసిందని బిజెపి చేసిన ఈ మోసపూరిత చర్య వల్ల బీసీలు ఎంతగానో నష్టపోయారని అందుకు బిజెపి తగు మూల్యం చెల్లించుకుంటదన్నారు.

బిజెపి పార్టీ కులగణనకు వ్యతి రేకంగా గత 11 సంవత్సరాలుగా వ్యవహరిస్తూనే ఉందని నేడు తెలంగాణ శాసనసభ ఆమోదించిన బిల్లులకు చట్టబద్ధత కల్పించకుండా బీసీలను అన్యాయానికి గురి చేసిం దని బిజెపి పార్టీ పచ్చి బీసీ వ్యతిరేక పార్టీ అనే నిజాన్ని బీసీ జాతి యావత్తు గ్రహించాలని కొంతమంది బిజెపికి చెందిన రాజ్యసభ సభ్యులు విషయాన్ని వక్రీకరించేందుకు తెగ తాపత్రయపడుతున్నారని సందెకాడ ఒక పార్టీలో పొద్దటి పూట మరొక పార్టీలో ఉంటూ కోట్లాది రూపాయల డబ్బు సంపాదిస్తూ బీసీలను అడ్డం పెట్టుకొని కోట్లకు పడగెత్తిన అలాంటి ఊసరవెల్లులను నడి బజారులో బట్టలు ఊడదీసి తిప్పుతామని ఆయన హెచ్చరించారు.

బీసీలను నిలువునా మోసం చేసిన బిజెపి పార్టీ నుంచి తక్షణమే ఆ రాజ్యసభ సభ్యుడు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రావాలని లేదా నోరు మూసుకుని కూర్చోవాలని ఆయన హితవు పలికారు.త్వరలోనే బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్రస్థాయి సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని ఆయన తెలిపారు.