10-10-2025 12:52:47 AM
* సీజ్ చేసిన 143.6 కిలోల ఎండు గంజాయి, 623 గంజాయి మొక్కల దగ్ధం
సంగారెడ్డి, అక్టోబర్ 9 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లాలోని వివిధ ఎక్సైజ్ స్టేషన్లలో కేసులు నమోదై పట్టుబడిన రూ.కోటి 34 లక్షల విలువైన 143.6 కిలోల ఎండు గంజాయి, 623 గంజాయి మొక్కలను అధికారులు దహనం చేశారు.
గురువారం సం గారెడ్డి జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆదేశాల మేరకు జిల్లా ఎక్సైజ్ అధికారి నవీన్ చంద్ర పర్యవేక్షణలో పటాన్చెరు మండలం ఇస్నాపూర్ వద్ద ఇన్సినరేషన్ పద్దతిలో దహనం చేసినట్లు తెలిపారు. జిల్లాలోని వివిధ ఎక్సైజ్ స్టేషన్లలో నమోదు చేసిన 26 కేసులలో సంగారెడ్డిలో 12, జహీరాబాద్లో 7, పటాన్చెరులో 5, నారాయణఖేడ్లో 2 కేసులలో సీజ్ చేయబడ్డ ఎండు గంజాయి, గంజాయి మొక్కలను దహనం చేసినట్లు సంగారెడ్డి స్టేషన్ హౌజ్ ఆఫీసర్ నజీర్ పాషా తెలిపారు.