calender_icon.png 12 October, 2025 | 10:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు

10-10-2025 12:51:11 AM

కొండాపూర్, అక్టోబర్ 9 : కొండాపూర్ మండల కేంద్రానికి చెందిన బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు షాబుద్దీన్ మైబెల్లి ఆధ్వ ర్యంలో 30 మంది బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు సిడిసి చైర్మన్ రామ్ రెడ్డి సమక్షంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.

ఈ సందర్బంగా మైబెల్లి మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికల్లో మండలం లోని అన్ని గ్రామాల్లో సర్పంచ్, ఎంపీటీసీ అభ్యర్థులను, జడ్పిటిసి స్థానం ను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్ర మంలో ఆత్మ కమిటీ చైర్మన్ వై ప్రభు, మాజీ ఎంపిటిసి సింహారెడ్డి, ప్రభుదాస్, కారా మోహిన్, సారా శోకత్ అలీ, నైకోటి అబ్దుల్, నైకోటి ఖాజామియా, శివ, నైకోటి మొహమ్మద్ పాల్గొన్నారు.