01-02-2026 07:19:36 PM
బోయినపల్లి,(జయ క్రాంతి); రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో ఆదివారం టిఆర్ఎస్ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ కు అక్రమంగా సీట్ నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపడుతూ నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ సీఎం కేసీఆర్ పై బురదజల్లేందుకు అక్రమంగా నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతుందని ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండయ్య, మాజీ జెడ్పిటిసి లచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శి గుంటి శంకర్, మండల రైతు సంఘం అధ్యక్షుడు నిమ్మ శ్రీనివాస్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు కవంపల్లి రాములు, రమేష్, ఎండి అజ్జు, తదితరులు పాల్గొన్నారు.