2 July, 2026 | 12:34 PM

Breaking News

వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •  

వందేళ్ల ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలి

17-06-2025 08:31 PM

గ్రామీణ ప్రజల సమస్యలపై స్పందించేది సిపిఐనే...

సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా...

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): వందేళ్ల సుదీర్ఘ పోరాటాల స్పూర్తితో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిస్కారం పార్టీ శ్రేణులు నిరంతరం కృషి చేయాలని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా(CPI District Secretary SK Sabir Pasha) కోరారు. లక్ష్మీదేవి పల్లి మండలంలోని ఉమ్మడి సీతారాంపురం, వేపలగడ్డ, లాలుతాడా పంచాయతీల పరిధిలోని 14 గ్రామాల మహాసభ సోమవారం రాత్రి జరిగింది. మహాసభకు ముఖ్య అతిధిగా హాజరైన సాబీర్ పాషా మాట్లాడుతూ... లక్ష్మీదేవిపల్లి ఏజెన్సీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందిస్తూ వాటి పరిష్కరం కోసం కమ్యూనిస్టు పార్టీ కృషి చేస్తోందని, ప్రజలకు సేవలందిస్తున్న ఫలితంగానే గ్రామాల్లో సిపిఐని ప్రజలు ఆదరిస్తున్నారన్నారు.

పోడు భూములకు పట్టాలు, సంక్షేమ పథకాల అమలుకోసం సిపిఐ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. పూర్తిస్థాయిలో రైతులకు రైతు భరోసా అందించాలని, వరికి రావాల్సిన బోనస్ క్వింటాకు రూ.5 వేలు విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు. మండల కార్యదర్శి చంద్రగిరి శ్రీనివాసరావు, నాయకులు ఎస్ కె ఫహీమ్, నేరెళ్ల  రమేష్, నూనావత్ గోవిందు, దారావత్ శ్రీను, బానోత్ నెహ్రు, సాపావట్ రవి,  జర్పుల ఉపేందర్, నూనావత్ చింటూ, బోడ రాములు, గుగులోత్ శ్రీను, తదితరులు పాల్గొన్నారు.