28 March, 2026 | 3:50 PM

ఎర్నేని బాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పద్మావతి జన్మదిన వేడుకలు

17-06-2025 08:34 PM

కోదాడ: నియోజకవర్గ అభివృద్ధి ఎమ్మెల్యే పద్మావతి, మంత్రి ఉత్తమ్ తోనే సాధ్యం అని కోదాడ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్నేని బాబు(Senior Congress Party leader Yerneni Babu) అన్నారు. మంగళవారం పట్టణంలోని  శకుంతల థియేటర్ సెంటర్ లో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ... నియోజకవర్గ ప్రజలే కుటుంబంగా చూసుకుంటున్న నాయకురాలు ఉత్తం పద్మావతి అన్నారు. పేద ప్రజలకు అన్నదానం నిర్వహించారు. కేక్ కట్ చేసి ఎమ్మెల్యే పద్మావతికి శుభాకాంక్షలు తెలిపారు.

జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సామినేని ప్రమీల రమేష్, మాజీ కౌన్సిలర్లు పెండం వెంకటేశ్వర్లు, కాజా, మైనుదీన్, రావెళ్ల కృష్ణారావు, వేమూరి విద్యాసాగర్, ఆవుల రామారావు, కారింగుల అంజన్ గౌడ్, గంధం పాండు, రాయపూడి వెంకటనారాయణ, ముస్తఫా, చందు నాగేశ్వరరావు, నెమ్మాది ప్రకాష్, దేవమణి, రహీం, శత్రుజ్ఞ, ఖాజా గౌడ్, కర్రీ సుబ్బారావు, సుధాకర్, సయ్యద్ బాబా పాల్గొన్నారు.