19-02-2026 01:16:15 AM
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
మున్సిపాలిటిలోని 22 వార్డులలో బీఆర్‌ఎస్, సీపీఐ పార్టీలు 14 మంది సభ్యులు కౌన్సిలర్లుగా విజయం సాధించి పూర్తి కోరంతో ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికలను అడ్డుకోవడం అనైతికమని, సిగ్గుమాలిన చర్య అని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఆరోపించారు. బుధవారం తన నివాసంలో బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ ప్రజలు వారికి ఇచ్చిన తీర్పును జీర్ణించుకోలేక పోలీసులను, అధికారులను తొత్తులుగా చేసుకొని కాంగ్రెస్ నాయకులతో గూండాయిజం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఓటుతో గెలువాలి కానీ, అప్రజాస్వామికం గా, చట్టవిరుద్ధంగా తమ పార్టీ అభ్యర్థులను బెదిరించడం వారికే చెల్లుతోందన్నారు.