4 May, 2026 | 11:30 AM

బీఆర్‌ఎస్‌కు అన్నీ అనుకూలంగా జరగాలంటే కుదరదు

10-12-2024 01:24 AM

సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

బీఆర్‌ఎస్ నేత లు అనుకుంటున్న విధంగా అన్ని పను లు జరగాలంటే కు దిరే పని కాదని సీ పీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభు త్వం తెలంగాణ తల్లి రూపానికి రూపకల్పన చేసిన సమయంలో ప్రతిపక్షా లను పిలిచి చర్చించలేదని గుర్తుచేశా రు.

టీఆర్‌ఎస్ తెలంగాణ సెంటిమెంట్‌ను పక్కన పెట్టి, తన పార్టీని బీఆర్‌ఎస్‌గా మార్చుకుంటే తప్పులేదు కానీ, ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారిస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఇప్పుడు ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహంలో హస్తం గుర్తు కనిపిస్తుందని కొందరంటున్నారని, కాంగ్రెస్ నేతలు దానిని అభయహస్తంగా పేర్కొంటున్నారన్నారు.

కానీ, అది తల్లి ఆ శీస్సులుగానే భావించాలని, పార్టీ గుర్తు కాదని గుర్తించాలని హితవు పలికారు. డిసెంబర్ 9వ తేదీని పండుగ అని పేర్కొంటున్న ప్రభు త్వం, సెప్టెంబర్ 17వ తేదీని భేషజాలు లేకుండా విమోచనా దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.