2 September, 2026 | 3:03 PM

ఉనికి కోసమే ప్రతిపక్షాల విమర్శలు

10-12-2024 | 01:26am

ఎమ్మెల్యే వేముల వీరేశం

కేసీఆర్ కుట్రల పాలనలో.. దొరల గ డీలో తెలంగాణ తల్లి తల్లడిల్లిందని ఎమ్మె ల్యే వీరేశం పేర్కొన్నా రు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తె లంగాణ తల్లికి కొత్త రూపం తీసుకొచ్చామని అన్నారు. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ లేదనడం కొందరి కుట్రేనని.. ఈ పండుగ ఉన్నతవర్గాలకే తప్ప  బహుజనులు ఎప్పుడూ జరుపుకోలేదన్నారు.

రేవంత్ సర్కార్ రూపొందించిన తెలంగాణ తల్లి బహుజనుల ప్రతిరూపమేనన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అ సెంబ్లీకి రాకుండా ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి లో దూసుకుపోతోందని..

ఆరు గ్యారెంటీలతో ప్రజలు ఆనందంగా ఉన్నారన్నా రు. ప్రతిపక్ష నేతలు ఉనికి కోసమే విమర్శలు చేస్తున్నారని.. ప్రజల కోసం కాద ని విమర్శించారు. ఇప్పటికైనా కేసీఆర్, హరీశ్‌రావు సభకు వచ్చి హూందాతనా న్ని నిరూపించుకోవాలని సూచించారు.