తూకం వేసిన వెంటనే రసీదు ఇవ్వాలి
16-04-2026 01:28 AM
దండేపల్లి (లక్షెట్టిపేట), ఏప్రిల్ 15: జిల్లాలో రైతులు పండించిన వరి ధాన్యం కాంటా అయిన వెంటనే లెక్క చేసి రైతులకు రసీదు అందజేయాలని దండేపల్లి మండల రైతులు డిమాండ్ చేశారు. బుధవారం దండేపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతు నాయకులు గాదె శ్రీనివాస్ మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరించిన వెంటనే ఎన్ని బస్తాలు,
ఎన్ని క్వింటాళ్లు, ఎంత నగదు వస్తుందనే వివరాలతో కూడిన రసీదుపై రైతు సంతకం తీసుకొని కాపీ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, ఎక్కడా అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.లారీలకు రైతులు డబ్బులు చెల్లించి ధాన్యం తరలించే పరిస్థితి రాకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల రైతులు రమేష్, సత్యనారాయణ, దినేష్ కుమార్ పాల్గొన్నారు.






