12 May, 2026 | 1:23 AM

ప్రయోగశాల పరిజ్ఞానంపై పట్టు తెప్పిస్తుంది

12-05-2026 12:11 AM

పియూ వీసీ జిఎన్ శ్రీనివాస్ 

పాలమూరు యూనివర్సిటీ, మే 11 : ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రయోగశాల ద్వారా ఎంతో పరిజ్ఞానం పై పట్టు తెప్పిస్తుందని శ్రీనివాస్ అన్నారు. సోమవారం పియూ లో స్పోరట్స్ గ్యాలరీలో ఇంజనీరింగ్ విభాగానికి ఆధునిక ల్యాబ్లను ప్రారంభించారు. ఈ సందర్బంగా వీసీ మాట్లాడుతూ విద్యార్థులకు వివిధ మౌఖిక పరీక్షలలో విజయం సాధించుటకు విద్యార్థుల ఉన్నత చదువులలో శాస్త్రవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ఈ ప్రయోగశాల పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.

విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం వివిధ కంపెనీలతో ఎం ఓ యు లు కుదుర్చుకుంటామని వారికి ఉన్నత విద్య ఉద్యోగాలకు అవసరమైన చర్యలు చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ పూస రమేష్ బాబు, యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్ చంద్ర కిరణ్ సార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ప్రవీణ,వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్, వివిధ విభాధిపతులు పాల్గొన్నారు.