12 May, 2026 | 1:24 AM

గద్వాలలో ఘనంగా విద్యా వారోత్సవాలు ప్రారంభం

12-05-2026 12:09 AM

గద్వాల మే 11 గద్వాలలో విద్యా వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్,ఎమ్మె ల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా నూతన అదనపు తరగతి గదులను ప్రారంభించి వేసవి శిక్షణ శిబిరాలకు శ్రీకారం చుట్టారు.విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు,సాంస్కృతిక రంగాల్లోనూ ప్రతిభ కనబరచాలని కలెక్టర్ సూచించారు.

క్యారమ్స్, చెస్,నృత్యం,హ్యాండ్రైటింగ్,చిత్రలేఖనం వంటి అంశాల్లో ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు.202627 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని కలెక్టర్ తెలిపారు.ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,అధికారులు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.