15 August, 2026 | 1:29 PM

కురిసింది వాన !

25-05-2024 12:31 AM

మహబూబ్‌నగర్/ వనపర్తి, మే 24 (విజయక్రాంతి): ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా శుక్రవారం భారీ గాలిదుమారంతో కూడిన వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఉండి, ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. వాన మొదలై సుమారు రెండు గంటల పాటు కురిసింది. మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాకేంద్రాల్లో వర్షం తీవ్రత ఎక్కువగా కనిపించింది. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి రహదారులపై పడ్డాయి. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.