calender_icon.png 23 February, 2026 | 5:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడురోజులు వర్షాలు

11-10-2024 01:04:55 AM

హైదరాబాద్, అక్టోబర్ 10(విజయక్రాంతి): ఆగ్నేయ దిశలో వీస్తున్న గాలుల ప్రభావంతో తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ గురువారం తెలిపింది. ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. వర్షసూచన ఉన్న జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.