3 April, 2026 | 9:18 PM

రెండు రోజులు వర్షాలు

04-07-2024 12:43 AM

హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): పశ్చి, నైరుతి దిశల నుంచి వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో గురు, శుక్రవారాల్లో పలు జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వా తావరణ కేంద్రం ప్రకటించింది. హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘా వృతమై ఉంటుందని, ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు పేర్కొంది.