calender_icon.png 31 December, 2025 | 11:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుటుంబ సభ్యులపైన పుట్ట మధు వ్యక్తిగత ఆరోపణలు చేయడం సిగ్గుచేటు

31-12-2025 09:15:38 PM

ఇలాంటి నాయకున్ని బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించాలి 

మీ కుటుంబ చరిత్ర చెప్పుతే ఎలా ఉంటుంది 

మతిభ్రమించి మాట్లాడుతున్న పుట్ట మధును హెచ్చరించిన మంథని కాంగ్రెస్ నాయకులు

మంథని,(విజయక్రాంతి): కుటుంబ సభ్యులపైన పుట్ట మధు వ్యక్తిగత ఆరోపణలు చేయడం సిగ్గుచేటని, మతి భ్రమించి పిచ్చోనిలా మాట్లాడుతున్న ఇలాంటి నాయకున్ని బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించాలని, మీ కుటుంబ సభ్యుల చరిత్ర చెప్పుతే ఎలా ఉంటుందో తెలుసుకోమని పుట్ట మధును మంథని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. మంథని అంబేద్కర్ చౌక్ లో మంథని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ తొట్ల తిరుపతి యాదవ్, మండలాధ్యక్షుడు ఐలి ప్రసాద్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ పుట్ట మధుకు రాజకీయ జీవితం ఇచ్చింది.

దుద్దిళ్ల కుటుంబమేనని, ఆ కుటుంబం గురించి అవివేకంగా మాట్లాడటం సరికాదని, రాజకీయ విమర్శలు చేయొచ్చుగానీ, కుటుంబ సభ్యులను ప్రస్తావించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు నియోజకవర్గానికి తీసుకొచ్చిన అభివృద్ధి, నిధులను చూసి మధుకు మైండ్ బ్లాక్ అవుతుందని, బహుజనవాదం పేరుతో మాట్లాడుతున్న పుట్ట మధు ఎంతమంది బహుజన నాయకులను తయారు చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ రాజ్యాంగంలో ఏర్పాటుచేసిన బుక్కులో అసభ్య పదజాలానికి చోటుందా అని ప్రశ్నించారు. మరోసారి శ్రీధర్‌బాబు, శ్రీను బాబు లేదా వారి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ పార్టీ, మంథని ప్రజలు  చూస్తూ ఊరుకోరని, శ్రీధర్‌బాబు అహర్నిశలు కష్టపడి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నారని, అదే ప్రజలు వరుసగా గెలిపిస్తున్నారని పేర్కొన్నారు.

పుట్ట మధు తన మాట తీరు మార్చుకోకపోతే రాజకీయంగా భారీ మూల్యం చెల్లించక తప్పదని స్పష్టం చేశారు. మీ కుటుంబ చరిత్ర తమకు మొత్తం తెలుసునని, కానీ మా నాయకులు నేర్పిన సాంస్కృతితో మేము నీలా మాట్లాడటం లేదని, ఇకముందు కూడా పిచ్చి లేసి ఇలాగే మాట్లాడితే మీ కుటుంబ చరిత్ర కూడా మొత్తం విప్పుతామని వారు తెలిపారు. పుట్ట మధుకు మతిభ్రమించిందని అతనిని వెంటనే ఎర్రగడ్డ ఆస్పత్రులు చేర్పించాలని నాయకులు అన్నారు. ఈ సమావేశంలో విద్యుత్ నియంత్రణ మండలి సభ్యుడు శశిభూషణ్ కాచే,

బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు అయిలి ప్రసాద్, దొడ్డ బాలాజీ, రోడ్డ బాబు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం, మంత్రి మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న,  మాజీ ఏఎంసి చైర్మన్ అజీమ్ ఖాన్, మహిళా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొలిపాక సుజాత, మంథని యూత్ మండల అధ్యక్షుడు సాదుల శ్రీకాంత్,  నాయకులు ఓడ్నాల శ్రీనివాస్, కొత్త శ్రీనివాస్, పెండ్రు రమాదేవి, మూల సరోజన, వైనాల రాజు, కోలేటి మారుతి, రమణారెడ్డి,  మంథని సత్యం, పోలు శివ, తోట చంద్రయ్య, తదితరులు నాయకులు,  కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు