31-12-2025 09:08:37 PM
చిట్యాల,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర డయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను బుధవారం తన స్వగ్రామంలో ఘనంగా నిర్వహించారు. చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో గుత్తా అమిత్ కుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా వారి నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణి
పల్లపు బుద్ధుడు ఆద్వర్యంలో జన్మదిన వేడుకలలో భాగంగా చిట్యాల పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి, జనపాల శ్రీను సమక్షంలో చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పల్లపు బుద్ధుడు నార్కట్ పల్లి అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గుత్తా అమిత్ కుమార్ రెడ్డి ఉన్నత స్థాయికి ఎదిగి ఇంకా గొప్పగా ప్రజా సేవ చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉరుమడ్ల గ్రామ సర్పంచ్ సాగర్ల భాను శ్రీ భిక్షం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి, ఉప సర్పంచ్ ఉయ్యాల నరేష్, మాజీ ఎంపీటీసీ పోలగోని స్వామి, సోషల్ మీడియా ఇంచార్జీ పట్ల జనార్ధన్, వార్డు సభ్యులు గంగాపురo రాము, మేడబోయున స్వాతి శ్రీను, మర్రి పూలమ్మ శంకర్ ,జనపాల శ్రీను, ఎలిమినేటి హరీ ప్రసాద్, మందుగుల పార్వతమ్మ, పాకాల దినేష్, కురుపటి లింగయ్య, రూపని యాదయ్య, గుత్తా రవీందర్ రెడ్డి, అనంతుల శంకర్, మర్రి రమేష్, రూపని చంద్రయ్య, మర్రి యాదయ్య, మందుగుల కుమార్ మర్రి సత్తయ్య, బోయ లక్షయ్య, పోలగోని శ్రీశైలం, వసుకుల శంకర్, దుబ్బ యాదయ్య, జనపాల జానయ్య, సాగర్ల మల్లేష్, బెలిజ పరమేష్, సుంకరి అశోక్ తదితరులు పాల్గొన్నారు.