20-06-2025 12:15:27 AM
ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమాను అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఎస్వీసీఎల్ఎల్పీ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా నాగార్జున విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
“-మంచి కథలు రావాలంటే స్టార్స్ కలిసి పనిచేయాలి. ఇంతకుముందు కూడా నేను చాలా సినిమాలు చేశాను. నాన్న, ఎన్టీఆర్, కృష్ణ, శోభన్‌బాబు.. ఇలా అంతా కలిసి ఎన్నో సినిమాలు చేశారు. శేఖర్ కమ్ముల సినిమాలు నాకు బాగా ఇష్టం. ఆయన కథల్లో సోషల్ రెలివెంట్ పాయింట్ ఉంటుంది. మిగతావి కూడా కమర్షియల్‌గానే ఉంటాయి. ‘-కుబేర’లో చాలా మంచి యూనిక్ పాయింట్ ఉంది. ఇప్పుడున్న సొసైటీకి ఆ పాయింట్ చాలా రిలెవెంట్. -ఈ సినిమాలో మంచోళ్లు ఉన్నారు.. చెడ్డోళ్లు ఉన్నారు.
అల్ట్రారిచ్, మిడిల్ క్లాస్, బిలో పావర్టీ లైన్.. ఇలా మూడు సొసైటీల మధ్య క్లాష్ ఈ సినిమాలో ఉంటుంది. -నాది మిడిల్ క్లాస్ క్యారెక్టర్. సీబీఐ ఆఫీసర్‌గా కనిపిస్తా. మంచి చేయాలా.. చెడు చేయాలా? అనే సంఘర్షణ మధ్య ఆ క్యారెక్టర్ ఉంటుంది. చాలా షేడ్స్ ఉంటాయి.. శేఖర్ నా క్యారెక్టర్‌ను చాలా అద్భుతంగా రాశారు. షటిల్ పెర్ఫార్మన్స్‌కు మంచి స్కోప్ ఉండే క్యారెక్టర్. నా ఇమేజ్‌కు తగ్గట్టు స్క్రిప్ట్‌లో మార్పులేమీ చేయలేదు. శేఖర్ ఏమనుకున్నారో అదే చేశారు. మారిస్తే చెడిపోతుందని.. నేను కూడా మార్పులు అడగలేదు.
‘ఆయన వర్కింగ్ స్టుల్ చాలా బాగుంటుంది. మీరు సినిమా అంతా ఎంజాయ్ చేస్తారు’ అని మా -చైతన్య చెప్పాడు. ఈ సినిమా కథ డిఫరెంట్. నా బాడీ లాంగ్వేజ్, మాట తీరు, రియాక్షన్.. అవన్నీ కూడా కొత్తగా ఉంటాయి. శేఖర్ కమ్ముల స్టుల్లో ఉంటాయి. రష్మిక మందన్న క్యారెక్టర్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది.. చాలా అద్భుతంగా చేసింది. సినిమా చూసి నువ్వే స్టార్ అని చెప్పాను. ఈ కథ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. రెగ్యులర్ స్క్రీన్‌ప్లే కాదు. రొటీన్ క్యారెక్టర్స్ కావు. ప్రతీది డిఫరెంట్‌గా ఉంటుంది.
ఇందులో ఏ క్యారెక్టర్ కూడా హీరో హీరోయిన్ అనడానికి లేదు. అన్నీ పాత్రలుగానే ఉంటాయి. ఇలాంటి సినిమాలు చేయడానికి గట్స్ కావాలి. పాన్ ఇండియా సినిమాలు చేయడం చాలా కష్టమైన పని. అన్ని సినిమాలు దానికి సరిపోవు. ఆ పేరుతో తీసినవన్నీ పాన్ ఇండియా సినిమాలు కావడం లేదు కదా! ఇక మిగతా ప్రాజెక్టులు.. నా 100వ సినిమా కోసం ప్లానింగ్స్ చేస్తున్నాం. వర్కింగ్ టైటిల్ ‘కింగ్ 100’ అని పెట్టారు. ‘శివ’4కే పనులు ఫినిష్ అయినట్టే.. ఇంకా బెటర్ ఎఫెక్ట్స్ కోసం వర్క్ జరుగుతోంది. ఒక రీల్ చూశాను. చాలా అద్భుతంగా ఉంది. ‘-కూలీ’లో డిఫరెంట్ క్యారెక్టర్.. ఫస్ట్ టైమ్ చేస్తున్నా.. చాలా కొత్తగా ఉంటుంది” అని చెప్పారు.