రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే
ఓబీసీ మోర్చా సోషల్ మీడియా నేషనల్ మెంబర్ పెరిక సురేష్
హైదరాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): తెలంగాణలో బీజేపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని బీజేపీ ఓబీసీ మోర్చా సోషల్ మీడియా నేషనల్ మెంబర్ పెరిక సురేష్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు రాను న్న ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మద్దతు అందిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ.. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు బీజేపీ ఎప్పటి నుంచో మద్దతుదారుగా ఉందన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహా రీ వాజ్‌పేయి నాయకత్వంలో చత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఏర్పాటయ్యాయని గుర్తు చేశారు. రాష్ట్ర సాధనలో మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ పార్లమెంట్లో అందించిన సంపూర్ణ మద్దతు చారిత్రాత్మకమని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, చరిత్ర, రాష్ట్ర సాధనలో ప్రముఖుల పాత్ర, అమరుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.






