calender_icon.png 15 May, 2025 | 9:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుల్తానాబాద్ లో ఏసీబీ వలలో ఎస్ఆర్ఎస్పీ ఉద్యోగులు

23-04-2025 10:56:01 PM

రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుపడ్డ అధికారులు..

పెద్దపల్లి (విజయక్రాంతి): లంచం తీసుకుంటూ ఎస్సారెస్పీ ఉద్యోగులు బుధవారం ఏసీబీకి పట్టుబడ్డారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ ఎస్సారెస్పీ కార్యాలయంలో చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ వీవీ రమణ మూర్తి కథనం ప్రకారం... ఎస్సారెస్పీ కార్యాలయంలో డివిజన్ సిక్స్ సూపరిండెంట్ శ్రీధర్ బాబు, సీనియర్ అసిస్టెంట్ సురేష్, రికార్డు అస్టెంట్ ఇజాజ్ ఇటీవల లీవ్ తీసుకున్నారు. దాన్ని ధృవీకరించేందుకు సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్ ఇద్దరు రూ.20 వేలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఇజాజ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి పకడ్బందీగా వారిని పట్టుకుని ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఈ ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది.