10 March, 2026 | 3:22 AM

నాలుగు రోజులు వర్షాలే!

18-09-2025 12:48 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): రాష్ట్రంలో నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. గురువారం ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. శుక్రవారం, శనివారం, ఆదివారం కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పలు జిల్లాల్లో కురుస్తాయని పేర్కొంది.