10 March, 2026 | 4:58 AM

బీజేపీ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం..

18-09-2025 12:48 AM

ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకలు..

తంగళ్ళపల్లి సెప్టెంబర్ 17 (విజయక్రాంతి)తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా తంగళ్ళపల్లి బీజేపీ పార్టీ కార్యాలయం నందు జాతీయ జెండా ఆవిష్కరణ మరియు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ సందర్భంగాతంగళ్ళపల్లి మండలం అధ్యక్షులు శ్రీ వేన్నమనేని శ్రీధర్ రావు మాట్లాడుతూ ప్రధాని మోడీ చేసిన మంచి పనులను గుర్తు చేసుకుంటూ మూడోసారిగా భారతీయ జనతా పార్టీ నుండి ప్రధానమంత్రి కావడం నాయకత్వాన్ని మరింత ప్రతిష్టంగా చేసింది.

నరేంద్ర మోదీ సబ్ కా సాథ్, సబ్ కా విశ్వాస్ మంత్రం తో సమ్మిళితమైన, అభివృద్ధి ప్రధానమైన, అవినీతి రహితమైన పాలన ను అందించే దిశ గా ఒక కొత్త మార్పు కు శ్రీకారం చుట్టారు. అంత్యోదయ .. లేదా వరుస లోని చివరి వ్యక్తికి కూడా పథకాలు మరియు సేవల ను అందించాలన్న ధ్యేయం తో ప్రధానమంత్రి త్వరిత గతిన మరియు భారీ ఎత్తున కృషి చేస్తున్నారు.

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో, భారతదేశం లో అమిత వేగంగా పేదరిక నిర్మూలన జరుగుతున్నదని ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు గుర్తించాయి. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో బిజెవైఎం జిల్లా అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి జిల్లా సోషల్ మీడియా జూకంటి అఖిల్ జిల్లా కోశాధికారి ఆసాని లింగారెడ్డి తంగళ్ళపల్లి మండల ప్రధాన కార్యదర్శిలు

ఇటికల రాజు కోసిని వినయ్ ఉపాధ్యక్షులు రెడ్డిమల్ల ఆశీర్వాద్ కొడం భవిత ఇటికల మహేందర్ బూత్ అధ్యక్షులు కర్నె గణేష్ కరెండ్ల రవీందర్ రెడ్డి బోల్గం భాస్కర్ బక్కశెట్టి రాజేందర్ అమరగొండ రాజు గోనపెల్లి శ్రీనివాస్ కందుకూరి మహేశ్ సామల బాల మల్లేశం బోయిని రాజు శేఖర్ సిరిసిల్ల శ్రీనివాస్ జిందం సంతోష్ మ్యాకల సురేష్ కాళి చరణ్ నాగుల శ్రీనివాస్ ఉమ్మరెడ్డి అరవింద్ రెడ్డి బొజ్జ అజయ్ బొజ్జ తిరుపతి మైలారం మహేష్ తిరుపతి రెడ్డి పిట్టల దేవరాజు పిట్టల పరశురాం కొట్టే రాజిరెడ్డి రావుతూ శ్రీనివాస్ , సాభిర్ గొట్టం సందీప్ , శ్రీనివాస్ పాండాచారి అడిగొప్పుల శంకర్ బరిగాల రాజు , రాములు మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.