25-01-2026 12:40:29 AM
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘వీడీ14’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్టు నుంచి మేకర్స్ తాజాగా క్రేజీ అప్డేట్ ఇచ్చారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నెల 26న ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించనున్నట్టు వెల్లడించారు. ఈ సినిమా బ్రిటీష్ కాలం నేపథ్యం తో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది.
1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన యధార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న చిత్రమిది. విజయ్, రష్మిక ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ తర్వాత ఈ సినిమాలో మూడోసారి జం టగా కనిపించనుండటంతో దీనిపై మరింత క్రేజీ పెరిగింది. ఈ సినిమా ఫ్యాన్స్ ఆకలి తీరేలా ఉం టుందంటూ దర్శకుడు రాహుల్ ఇటీవల ఓ అభిమానికి సోషల్ మీడియా వేదికగా బదులివ్వడం అంచనాలు మరోస్థాయికి చేరాయి. ఈ చిత్రానికి అజయ్ -అతుల్ సంగీతం అందిస్తున్నారు.