25-01-2026 12:41:46 AM
యోగేశ్ కల్లె హీరోగా, సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘త్రిముఖ’. ఆకృతి అగర్వాల్, సీఐడీ ఆదిత్య శ్రీవాత్సవ, మొట్టా రాజేంద్రన్, ఆశురెడ్డి, సాహితీ దాసరి, ప్రవీణ్, షకలక శంకర్, సుమన్, రవిప్రకాశ్, జీవా, సమ్మెట గాంధీ, జెమినీ సురేశ్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీదేవి మద్దాలి, రమేశ్ మద్దాలి నిర్మిస్తున్నారు. రాజేశ్ నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. ఐదు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించిన ఈ సినిమాను ఈ నెల 30న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో విడుదల చేయనున్నారు.
ఈ విషయాన్ని శనివారం ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌లో టీమ్ వెల్లడించింది. ఈ సందర్భంగా హీరో యోగేశ్ కల్లె మాట్లాడుతూ.. “హీరోగా నా ఫస్ట్ మూవీ ఇది. అడ్డంకులన్నీ దాటుకుని ఈ నెల 30న రిలీజ్‌కు తీసుకొస్తున్నాం. సన్నీ లియోన్ మా సినిమాలో నటించడం విశేషం. సీఐడీ ఆదిత్య శ్రీవాత్సవ ఇప్పటిదాకా తెలుగులో నటించలేదు. మా కంటెంట్ నచ్చి ఆయన ఒప్పుకున్నారు. కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న కథతో ఒక కొత్త ప్రయత్నం చేశాం” అన్నారు.
డైరెక్టర్ రాజేశ్ నాయుడు మాట్లాడుతూ.. “ఒక మంచి కథతో, బలమైన స్క్రీన్‌ప్లేతో ‘త్రిముఖ’ని రూపొందించాను. మూవీ ఫస్టాఫ్ అంతా ఎంటర్ టైన్ చేస్తుంది. సెకండాఫ్ తల పక్కకు తిప్పనంతగా ఎంగేజింగ్‌గా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. రొటీన్ సినిమాలకు తప్పకుండా భిన్నంగా ఉండేలా ప్రయత్నించాం. సన్నీ లియోన్‌ని ఇప్పటిదాకా గ్లామర్ యాంగిల్‌లోనే చూశారు. ఆమె నటిగా పర్‌ఫార్మెన్స్ చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూస్తారు” అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటీనటులు జెమినీ సురేశ్, ప్రవీణ్, సాహితీ దాసరి కూడా మాట్లాడారు.