25-01-2026 12:40:21 AM
విభిన్నమైన పాత్రలు, సరి కొత్త కథలు ఎంచుకుంటూ వరుస సిని మాలతో అలరిస్తోంది మలయాళ బ్యూటీ అను పమ పరమేశ్వరన్. అయితే, ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ థ్రిల్లర్ ‘లాక్‌డౌన్’ చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే, ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్టు టీమ్ అధికా రికంగా వెల్లడించారు. ఏఆర్ జీవా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత సంవత్సరమే విడుదల కావాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమా కొత్త విడుదల తేదీని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
ఈ చిత్రంలో అనుపమ ‘అనిత’ అనే మధ్యతరగతి యువతి పాత్రలో కనిపించనుంది. కరోనా లాక్‌డౌన్ కాలంలో సామాన్యులు ఎదుర్కొన్న చేదు అనుభవాలు, ముఖ్యంగా ఒక యువతి ఒంటరిగా క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కొందనే యధార్థ గాథే ఈ సినిమా. ఇదిలావుండగా అనుపమ ఓ టాలీవుడ్‌తో త్వరలో పలుకరించనుంది. ‘క్రేజీ కల్యాణం’ అనే టైటిల్ వస్తున్న ఈ సినిమాలో అనుపమ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఇందులో అనుపమ సరసన తరుణ్ భాస్కర్ నటిస్తుండగా, నరేశ్ వీకే, అఖిల్ ఉడ్డెమారి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
పెళ్లి వేడుకల నేపథ్యంలో సాగే ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. కామెడీ, ఎమోషన్స్, కుటుంబ సంబంధాల చుట్టూ తిరిగే కథతో దర్శకుడు భద్రప్ప గాజుల తెరకెక్కిస్తున్నారు. యారో సినిమాస్ బ్యానర్‌పై బూసమ్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రధానంగా తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతోంది. అనుపమ ఇందులో తెలంగాణ గ్రామీణ యువతి పాత్రను పోషిస్తోంది. ఈ పాత్ర కోసం ఆమె ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వర్క్‌షాప్‌లో పాల్గొని తెలంగాణ యాస, బాడీ లాంగేజ్‌పై శిక్షణ పొందటం విశేషం.