29 August, 2026 | 4:40 AM

ఫ్యూచర్ సిటీలో మహేశ్వరం విలీనంపై జేఏసీ డిమాండ్

29-08-2026 12:35 AM

31, సెప్టెంబర్ 1న రిలే దీక్షలు

మహేశ్వరం, అగస్టు 28 (విజయక్రాంతి): భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో మహేశ్వరం ప్రాంతంలోని అన్ని గ్రామాలను పూర్తిస్థాయిలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఫ్యూచర్ సిటీ జేఏసీ ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో మహేశ్వరం ప్రభుత్వ కార్యాలయాల ముందు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు ప్రకటించింది. శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడారు.

నానమ్మ తాత ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30 వేల ఎకరాల్లో రూపుదిద్దుకుంటున్న ఫ్యూచర్ సిటీకి మహేశ్వరమే ఆధారమని, ఐటీ, ఏఐ, డేటా సెంటర్లు, ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీతో ఈ ప్రాంతం ’గోల్డెన్ హబ్’గా మారుతుందని జేఏసీ చైర్మన్ వత్తుల రఘుపతి తెలిపారు. ఇప్పటికే కొన్ని గ్రామాలు విలీనం కాగా, మిగిలిన గ్రామాల సర్పంచులు కూడా వెంటనే ఏకగ్రీవ తీర్మానాలు చేసి ఎంపీడీవోకు అందజేయాలని జేఏసీ అధ్యక్షుడు కర్నాటి మనోహర్ డిమాండ్ చేశారు. భవిష్యత్ తరాల మేలు కోసం సర్పంచులు ముందుకు రాకపోవడాన్ని నిరసిస్తూనే ఈ దీక్షలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.