calender_icon.png 9 November, 2025 | 12:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సదరు ఉత్సవాలకు రండి

08-11-2025 08:28:27 PM

రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డిని ఆహ్వానించిన జడ్చర్ల యాదవ సంఘం నేతలు..

జడ్చర్ల: పట్టణ కేంద్రంలోని నేతాజీ చౌరస్తాలో ఈ నెల 15న జడ్చర్ల యాదవ సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే సదరు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు యాదవ సంఘం నాయకులు తెలిపారు. ఈ ఉత్సవాలకు రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ శ్రీ లక్ష్మారెడ్డిని హైదరాబాదులోని నివాసంలో కలిసి ఆహ్వాన పత్రికను అందించి సదరు ఉత్సవాలకు హాజరుకావాలని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర మాజీమంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి సానుకూలంగా స్పందిస్తూ ఉత్సవాలకు వస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుదర్శన్ కమిటీ అధ్యక్షుడు గిరి యాదవ్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షులు మచ్చల శ్రీను యాదవ్, సంఘం సీనియర్ నాయకులు విశ్వేశ్వర్ యాదవ్, వంగూరు హరిత నరసింహ యాదవ్, ప్రభాకర్ యాదవ్, కేశవులు యాదవ్, కుంభం కృష్ణ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.