6 June, 2026 | 11:51 PM

Breaking News

విద్యుత్ పెన్షనర్లపై ‘ఐఏఎస్’ కక్షసాధింపు.. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు తూట్లు!   •   కామారెడ్డి జిల్లాలో అంతర్ జిల్లా వాహనాల చోరీ ముఠా అరెస్ట్   •   పంచభూతాలను కలుషితం చేస్తున్న డంపింగ్ యార్డ్ ఎత్తివేతే లక్ష్యంగా పోరాటం   •   పెట్రోలింగ్, బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి   •   ఆకట్టుకున్న చిన్నారుల కూచిపూడి నృత్యాలు   •   బావుసాయిపేటలో ఉచిత వైద్య శిబిరం   •   దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర ఎంతో గొప్పది : ఎంపీ ఈటల రాజేందర్   •   సమస్యల పరిష్కార సాధనకే గ్రామసభలు   •   సర్కారు భూముల పరిరక్షణే ధ్యేయం   •   రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు   •  

నగర నడిబొడ్డున భూగర్భ జలాలు కలుషితం

08-11-2025 08:33 PM

పట్టించుకోని ప్రజాప్రతినిధులు..

హనుమకొండ (విజయక్రాంతి): కాజీపేట డివిజన్‌లోని సోమిడి, విష్ణుపురి మీదుగా వచ్చే డ్రైనేజీ నీరు రెహమత్‌నగర్‌ ను ఆనుకుని ఉన్న ఎఫ్‌సీఐ గోదాం గుండా వచ్చి నగరం నడిబొడ్డున ఉన్న రహమత్ నగర్ భూగర్భజలాలు కలుషితమవుతున్నాయని నూతన డ్రైనేజీని నిర్మించాలని స్థానిక కార్పొరేటర్‌, ఎమ్మెల్యేకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. శనివారం హనుమకొండ ప్రెస్‌క్ల‌బ్‌లో కాలనీవాసులు గోడు వెల్లబోసుకున్నారు. డ్రైనేజీ లేకపోవడంతో మురుగునీరు నిలిచిపోయి విపరీతమైన దుర్వాసన, దోమల వలన డెంగ్యూ, కలుషిత జలాల వినియోగం వలన టైఫాయిడ్‌ వంటి అనేక విషజ్వరాలు ప్రబ‌లుతున్నాయని వాపోయారు.

మున్సిపల్‌ కమిషనర్‌కు, ఎమ్మెల్యేకు సైతం ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని, వెంటనే డ్రైనేజీ నిర్మించాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు కె.రాజేష్‌, ఎండి.హైదర్‌, సత్యనారాయణ, ఖాజా, సారంగపాణి, ఎండి.ముంతాజ్‌, ఎండి.అమీద, రఘు, స్వరూప, కవిత, రాంబాబు, ఖలీల్‌, సిరాజ్‌, రజాల్‌, సత్తార్‌, సర్వర్‌, గౌస్, మొయిన్‌, దిల్షద్‌, రహముద్దిన్ తదితరులు పాల్గొన్నారు.