08-11-2025 08:26:19 PM
మొయినాబాద్ (విజయక్రాంతి): ప్రమాదవశాత్తు ఓ ఆటోను ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు ఢీకొట్టింది. ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని అజీజ్నగర్ రెవెన్యూలో ఉన్న క్రిక్ సైడ్ ఇంటర్నేషనల్ పాఠశాలకు చెందిన బస్సు విద్యార్థులను ఎక్కించుకొని చేవెళ్ల వైపు శనివారం సాయంత్రం వెళ్తుండగా మార్గమధ్యలో జేబీఐఈటీ చౌరస్తాలో యూటర్న్ తీసుకుంటున్న మొయినాబాద్ ప్రాంతానికి అఖిల్ ఆటోను బస్సు ప్రమాదవశాత్తు ఢీకొట్టింది.
దీంతో అటో డ్రైవర్ అఖిల్కు స్పల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన బస్సులో విద్యార్థులు ఉన్నారు. వారికి ఎలాంటి గాయాలు కాలేవు. వారిని వేరే బస్సులో అక్కడి నుంచి తరలించారు. ఆటో డ్రైవర్ అఖిల్ సమీపంలోని భాస్కర ఆసుపత్రిలో చిన్నపాటి గాయాలతో చికిత్సపొందుతున్నారు. రోజూ ఇదే రహదారిపై ప్రమాదాలు జరుగుతుండడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.