17 April, 2026 | 3:02 PM

కీసరగుట్టకు జగద్గురు స్వామి రాక

01-11-2025 12:00 AM

 అభిషేకాలు, దర్శన వేళల్లో మార్పులు

కీసర, అక్టోబర్ 31(విజయక్రాంతి); కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి శ్రీ జగద్గురు విధుశేఖర భారతీ మహా స్వామి వారు పర్యటించనున్నారు. నవంబర్ 2వ తేది ఆదివారం సందర్శించనున్న సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వహకులు దర్శన వేళ్లో తాత్కాలిక మార్పులు చేసినట్లు ఆలయ చైర్మన్ తటాకం నారాయణ శర్మ, ఆలయ ఈవో కట్ట సుధాకర్ తెలిపారు. భక్తులు ఈ మార్పులను గమనించి, స్వామి వారి దర్శనం, అభిషేక కార్యక్ర మాల్లో పాల్గొనాలని కోరారు.

మహా స్వామి వారు ఆలయానికి వేంచేస్తున్నందున, ఆదివారం ఉదయం 6:00 గంటల నుండి 11:00 గంటల వరకు భక్తులకు నిర్వహించే అభిషేకాలు తాత్కాలి కంగా నిలిపివేయబడతాయనీ, పునఃప్రారంభం అభిషేకాలు తిరిగి ఉదయం 11:00 గంటల నుంచి భక్తులకు అందుబాటులోకి వస్తాయిని తెలిపారు.

జగద్గురు మహా స్వామి వచ్చినప్పుడు, ఒక గంట సేపు పాటు ధర్మదర్శనాలు నిలిపివేయబడతాయి. స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులు ఈ సమయ మార్పులను గమనించగలరని ఆలయ చైర్మన్ తటాకం నారాయణ శర్మ, ఆలయ ఈవో కట్ట సుధాకర్ రెడ్డి , ధర్మకర్తల మండలి విజ్ఞప్తి చేశారు.