calender_icon.png 1 November, 2025 | 10:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విశ్వహిందూ పరిషత్ భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు

01-11-2025 12:00:00 AM

ఎల్లారెడ్డి అక్టోబర్ 31 (విజయక్రాంతి): ఎల్లారెడ్డి: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ శాఖ ఆధ్వరంలో స్నేహ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో రక్త దాన శిబిరం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అయోధ్య భవ్య రామ మందిరం నిర్మాణం కోసం ప్రాణాలు అర్పించిన కోఠారి బ్రదర్స్ మరియు ఎందరో ప్రాణాలను బలిదానం ఇచ్చినటువంటి హైందవ సోదరుల జ్ఞాపకార్థంగా విశ్వహిందూ పరిషత్  భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హుతాత్మ దివాస్ ని పురస్కరించుకొని ఈ రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు.

ముఖ్యఅతిథిగా మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్ హాజరైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు మాట్లాడుతూ.. ఈ రక్తదాన శిబిరానికి మంచి స్పందన లభించిందని 52 యూనిట్ల రక్తం సేకరించడం జరిగిందని నిర్వహకులు తెలిపారు. రక్తదానం కోసం యువత ముందుకు రావడం అభినందనీయమని, రక్తదానం వల్ల ఎందరో ప్రాణాలు కాపాడినవారమవు తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా త్రి కండ సంఘటన మంత్రి వినోద్ కుమార్, జిల్లా గోరక్ష తులసి దాస్, హరిబాబు, ఎల్లారెడ్డి బజరంగ్ దళ్ సంయోజక్ భరత్, పట్టెం కిషన్, రాహుల్, గాండ్ల రాజు, క్రాంతి కుమార్, ప్రకాష్, అఖిల్, యాదగిరి, భజరంగ్దళ్ కార్యకర్తలు హిందూ బంధువులు, యువకులు పాల్గొన్నారు.