31-10-2025 11:29:43 PM
బోడుప్పల్ కమిషనర్ శైలజ
మేడిపల్లి,(విజయక్రాంతి): బోడుప్పల్ నగర పాలక సంస్థ యందు ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తున్న పలు దూకాణ ములలో సానిటరీ ఇన్స్పెక్టర్స్ శ్రీనివాస్ రెడ్డి, సంగీత మరియు ప్లాస్టిక్ టాస్క్ ఫోర్స్ టీమ్ దాడులు నిర్వహించి పట్టుకోవడం జరిగినది.నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయిస్తున్నందున జారిమాన మొత్తముగా 35,000/- రూపాయలు విధించడం జరిగినది.
ఈ సందర్భముగా కమీషనర్ మాట్లాడుతూ... ప్లాస్టిక్ వాడకం వలన పర్యావరణమునకు హానికరం మరియు క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశము ఉన్నందున నిషేదించడం జరిగినది. కావున ప్లాస్టిక్ వాడకము తగ్గించి పర్యావరణ పరిరక్షణకు తొడ్పాడాలని తెలిపారు. అదే విధముగా ఎవరైనా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయిస్తే భారీ జరిమానతో పాటు కఠిన చర్యలు చేపట్టబడునని హెచ్చరించారు. కావున ప్రజలు స్వచ్ఛ, ప్లాస్టిక్ రహిత బోడుప్పల్ కు సహకరించాలని కోరారు.