calender_icon.png 20 November, 2025 | 9:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు పదోసారి బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణం

20-11-2025 08:27:04 AM

పాట్నా: బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్(Nitish Kumar) గురువారం నాడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు పాట్నాలోని గాంధీ మైదానంలో నితీష్ ప్రమాణస్వీకారం చేస్తారు. రికార్డుస్థాయిలో పదోసారి ఆయన ప్రమాణస్వీకారం చేస్తున్నారు. నితీష్ కుమార్ తో పాటు 35 నుంచి 36 మంది మంత్రులు కూడా ప్రమాణం చేసే అవకాశముందని ఏన్డీయే వర్గాలు తెలిపాయి. నితీష్ ప్రమాణస్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi), అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, ఎన్డీఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.

ప్రమాణస్వీకారానికి 3 లక్షలకుపైగా అభిమానులు, కార్యకర్తలు హాజరయ్యే అవకాశముంది. నితీష్ ప్రమాణానికి భారీ ఏర్పాట్లు చేశారు. బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారానికి ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారం రాత్రి పాట్నా చేరుకున్నారు. గురువారం నగరంలోని చారిత్రాత్మక గాంధీ మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు దిల్ప్ జైస్వాల్, పార్టీ సీనియర్ నాయకులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హాలతో కలిసి షా, నడ్డాను నగర విమానాశ్రయంలో స్వాగతించారు.