క్రికెటర్ మానిత్‌కు జగ్గారెడ్డి అభినందన
సంగారెడ్డి, జూన్ 8 : సంగారెడ్డి పట్టణానికి చెందిన వర్ధమాన క్రికెటర్ నెవిన్ మానిత్ను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. మానిత్ ప్రతిభను మానిత్ తండ్రి, కాంగ్రెస్ నాయకుడు, ఫిజియోథెరపిస్ట్ అయిన మధు ద్వా రా తెలుసుకున్న ఆయన భవిష్యత్తులో మం చి క్రికెటర్ గా ఎదగడానికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. మానిత్ ఇంకా మెరుగైన శిక్షణ పొందడానికి,
వేర్వేరు టోర్నమెంట్లలో ఆడటానికి అయ్యే పూర్తి ఖర్చులను తానే భరి స్తానని జగ్గారెడ్డి భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో మరింత బాగా ఆడి సంగారెడ్డి జిల్లా కు, తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని జగ్గారెడ్డి ఆకాంక్షించారు. కార్య క్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అనంత్ కిషన్, మాజీ క్రికెటర్ రఘు తదితరులు పాల్గొని మానిత్ను అభినందించారు.
జాతీయ స్థాయిలో ప్రతిభ..
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరపున 2024 లో బీహార్ (పాట్నా) లో జరిగిన అండర్-17 జాతీయ పోటీల్లో తెలంగాణ తరపున మానిత్ ఆడాడు. 2026 లో చండీగఢ్లో జరిగిన అండర్-19 జాతీయ పోటీల్లో కూడా పాల్గొని రాణించాడు. వెంకటస్వామి గోల్ కప్ సీనియర్ లీగ్లో మెదక్ జిల్లా తరపున ఆడుతూ మహబూబ్నగర్ జట్టుపై హాఫ్ సెంచరీ చేశాడు.ఢిల్లీలోని ఒక ప్రముఖ క్లబ్ తరపున ఆడుతూ అద్భుతమైన సెంచరీ చేశాడు. ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లీగ్స్లో స్పోర్టి క్లబ్ తరపున టీ 20, వన్డే, టూ-డే మ్యాచ్లు ఆడుతున్నాడు.






