9 June, 2026 | 1:02 AM

కవిత సోయి తప్పి మాట్లాడుతుంది

09-06-2026 12:00 AM

మెదక్ ఎంపీ రఘునందన్‌రావు 

సంగారెడ్డి, జూన్ 8 : టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవితకు నోరుందని ఏది పడితే అది మాట్లాడుతున్నారని, కనీస పరిజ్ఞానం లేకుండా వ్యాఖ్యానించడం సరికాదని మెదక్ ఎంపీ రఘునందన్రావు విమర్శించారు. సోమవారం ఆయన సంగారెడ్డిలో బిజెపి కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రఘనందన్ రావు జహీరాబాద్ ఎంపి అని కవిత అవివేకంగా మాట్లా డుతుందని, తాను మెదక్ ఎంపి అని తెలియదా అని ప్రశ్నించారు. స్క్రిప్ట్ రాసేవా రికైనా సోయి ఉండాలన్నారు.

తాను జహీరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్ తెస్తానని హామి ఇ చ్చినట్లు కవిత చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అలా అనుకుంటే మీ నాన్న కే సీఆర్ ఎన్ని మాటలు తప్పాడో తెలుసుకోవాలన్నారు. జహీరాబాద్కు ప్రధాని మోడీ ని మ్జ్ మంజూరు చేసిన విషయం తెలియదా అన్నారు. తెలంగాణ వస్తే సింగూరు ప్రాజెక్టు పై కుర్చీ వేసుకుని మరమ్మతులు చేయిస్తా అన్నాడని, మరి ఎందుకు చేయలేదని ప్ర శ్నించారు. సింగూరులో చేపలు తినలేకపోయిండు గానీ ఆంధ్ర వెళ్ళి రోజా ఇంట్లో రొ య్యలు మాత్రం మింగిండని విమర్శించారు.

తాను ఎవరితో లాలూచీ పడటం లేదని, దుబ్బాకలో హరీష్రావుకు గీతగీసి గెలిచిన వ్యక్తి తానేనని తెలిపారు. నీ పార్టీకి నిధులు ఎక్కడివి ? నీవు ఎవరితో కలిసి పనిచేస్తున్నావో తెలియదా...? జాగృతి పెట్టినప్పుడు కవితకు ఇప్పటి కవితకు చాలా తేడా ఉందన్నారు. తెల్లాపూర్ ను తెలంగాణ పురంగా మార్పిస్తానని చెప్పినవ్..మీ నాన్నతో ఆ ఒక్క పని చేయించలేకపోయావన్నారు.

అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం ఇవ్వకపోతే తెల్లాపూర్ శాసనానికి కట్టేసి కొట్టమని కల్లబొల్లి మాటలు చెబుతున్న కవిత ఆనాడు ఎందుకు తెల్లాపూర్ పేరు మార్చలేదని ప్రశ్నించారు. పదేళ్ళు సీఎంగా ఉన్న కేసీఆర్ ఒక్కరోజైన ఉమ్మడి మెదక్ జిల్లాను సందర్శించి బాగోగులు పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే దమ్ముందా అని నిలదీశారు. జహీరాబాద్కు బుల్లెట్ ట్రైన్ ఇస్తామని కేంద్రం ప్రకటించినట్లు ఉంటే తీసుకురండి..తప్పకుండా పోరాటం చేస్తామని రఘునందన్రావు తెలిపారు.