calender_icon.png 21 February, 2026 | 8:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిగ్ టీవీ అధినేతకు జాగృతి అధ్యక్షరాలు కల్వకుంట్ల కవిత పరామర్శ

20-02-2026 12:00:00 AM

మహబూబాబాద్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): ఇటీవల పితృవియోగానికి గురైన బిగ్ టీవీ అధినేత వెన్నం విజయకాంత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు వెన్నం శ్రీకాంత్ రెడ్డి సోదరులను గురువారం జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. శ్రీకాంత్ రెడ్డి, విజయ కాంత్ రెడ్డి తండ్రి రాఘవేందర్ రెడ్డి ఇటీవల గుండెపోటుతో దివంగతులయ్యారు. మహబూబాబాద్ జి ల్లా రెడ్యాలలోని విజయ కాంత్ రెడ్డి, శ్రీ కాంత్ రెడ్డి గృహానికి కవిత చేరుకొని దివంగత రాఘవేందర్ రెడ్డి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వెన్నం సోదరులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కవిత వెంట మారిపల్లి మాధవి, శ్రీకాంత్ గౌడ్, వేణు, ఇస్మాయిల్ తదితరులున్నారు.