calender_icon.png 21 February, 2026 | 10:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మసీద్‌కు సైరన్ అందజేత

20-02-2026 12:00:00 AM

మహబూబాబాద్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): రంజాన్ మాసం సందర్భంగా కొత్తగూడ మండల కేంద్రంలోని మసీదుకు గ్రామ సర్పంచి మల్లెల భాగ్యమ్మ సైరన్ అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో అన్ని మతాల ప్రజలు ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షించారు. ముస్లిం సోదరసోదరీమణులు ఆచరించే ఉపవాస దీక్షలకు నమాజు సమయాన్ని తెలియజేసేందుకు సైరన్ అందజేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజశేఖర్, మాజీద్ కమిటీ అధ్యక్షులు అజ్మీర్, మత గురువు ముద్దసిర్, మత పెద్దలు యాకుబ్ పాషా, మాజీ కో ఆప్షన్ సభ్యులు సయ్యద్, సద్దాం, బిరుదు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.