calender_icon.png 1 May, 2025 | 3:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జై బాపు.. జై భీమ్..జై సంవిధాన్ కార్యక్రమం

10-04-2025 01:58:06 AM

ముఖ్య అతిథిగా పాల్గొన్న తుంబూరు దయాకర్ రెడ్డి..

కూసుమంచి , ఏప్రిల్ 9 :-  స్వాతంత్య్ర పోరాటంలో మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గం .. రాజ్యాంగ నిర్మాణంలో బీఆర్. అంబేద్కర్ విశేష కృషి ,  రాజ్యాంగం అందించిన సమానత్వం, న్యాయం వంటి విలువలను గౌరవించేందుకు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యక్తిగత సహాయకులు తంబూరి దయాకర్ రెడ్డి తెలిపారు. బుధవారం కూసుమంచి మండల కేంద్రంలోనీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలతో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ..

అనంతరం క్యాంపు కార్యాలయం నుండి ద్విచక్ర వాహనలతో ర్యాలీగా బయలుదేరి మండల ప్రధాన కూడలిలో ఉన్న అంబేద్కర్ ,రాజీవ్ గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.. ఈ సందర్బంగా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ మహాత్మా గాంధీ శాంతి సందేశం, అంబేద్కర్ సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం, మన రాజ్యాంగంలోని విలువలను ప్రజలకు చేరవేయడం కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్యంగా భావించాలన్నారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన వారి చేత ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు పువాళ్ళ దుర్గాప్రసాద్, ఓబిసి చైర్మన్ పుచ్చకాయల వీరభద్రం, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాట్టే గురవయ్య , టీపీసీసీ స్పోక్స్ పర్సన్ కొరివి వెంకటరత్నం, మొహమ్మద్ హఫీజుద్దీన్, జొన్నలగడ్డ రవికుమార్, మాదాసు ఉపేంద్ర రావు, కంచర్ల జీవన్ రెడ్డి, బాణోత్ సురేష్ నాయక్, బెల్లంకొండ శరత్, వడిత్య సెట్రం నాయక్, కేశవ రెడ్డి, బారి వీరభద్రం, వడిత్య కుమార్, గుండా భూపాల్ రెడ్డి, బండారుపల్లి శ్రీనివాసరావు, పేండ్ర అంజయ్య, రమేష్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు..