20-08-2025 02:31:21 PM
చేర్యాల ఎస్ఐ నవీన్..
చేర్యాల: చేర్యాల పట్టణంలోని గౌతమి వోకేషనల్ జూనియర్ కాలేజీలో బుధవారం చేర్యాల ఎస్ఐ నవీన్(SI Naveen) మాట్లాడుతూ, విద్యార్థిని విద్యార్థులకు మహిళలకు ఉన్న రక్షణ చట్టాల గురించి, షీ టీమ్ గురించి, ర్యాగింగ్ ఇవిటీజింగ్ పోక్సో షీ టీమ్స్ యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ సైబర్ నేరాలు, నూతన చట్టాల గురించి అపరిచిత వ్యక్తుల యొక్క ఫోన్ కాల్స్ మాటలు నమ్మవద్దని సోషల్ మీడియాను అవసరం వరకే వాడుకోవాలని మీ చదువుల కొరకు తల్లిదండ్రుల కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని చెడు అలవాట్లకు బానిస కాకుండా చదువుకోవడం వలన భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చేర్యాల ఎస్ఐ నవీన్, హుస్నాబాద్ షీటీమ్ బృందం కాలేజ్ ప్రిన్సిపల్ శివశంకర్ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.