జై భీమ్ కళాకారులు ఐక్యమత్యంతో ముందుకు సాగాలి
10-09-2025 10:08 PM
నాగారం: జై భీమ్ డప్పు కోలాటం బృందాల కళాకారులంతా ఐక్యమత్యంతో ముందుకు సాగాలని రాష్ట్ర జై భీమ్ కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు చిప్పలపల్లి మల్లేష్ అని అన్నారు. సూర్యాపేట జిల్లా నాగారం మండల నాగారం బంగ్లా గ్రామంలోని రహదారి బంగ్లాలో తుంగతుర్తి నియోజకవర్గం డప్పు, కోలాటం కళాకారుల కమిటీలు నిర్వహించడం జరిగింది. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కళాకారులంతా ఐకమత్యంతో ఉండాలి. తమ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మచ్చ నరసయ్య, కోటేష్, కొమ్ము సోమయ్య నరేష్, మహేష్ ఉమా, నరేష్ రవి అయోధ్య వెంకటేష్ నియోజకవర్గంలోని అన్ని మండలాల గ్రామాల కోలాట బృందాలు పాల్గొనడం జరిగింది.






