అందుబాటులోకి అత్యాధునిక క్యాన్సర్ సంబంధిత వైద్య సేవలు
హన్మకొండ (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ ప్రజలకు క్యాన్సర్ సంబంధిత అత్యుత్తమ వైద్య చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Naini Rajender Reddy) అన్నారు. క్యాన్సర్ వ్యాధి వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ, రెనోవా బన్ను హాస్పిటల్స్ ద్వారా తెలంగాణలో రెండవ పెద్ద నగరమైన వరంగల్ ప్రాంతంలో సామాన్యులకు అత్యాధునిక, సమగ్రమైన క్యాన్సర్ చికిత్స అందుబాటులోకి రావడం, హన్మకొండ నియోజక వర్గ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు రెనోవా బన్ను హాస్పిటల్స్ యాజమాన్యానికి అభినందనీయమన్నారు. క్యాన్సర్ చికిత్సలో ఎంతో అనుభవం గడించిన వైద్యులు, యాజమాన్య సభ్యులు కలసి కొత్తగా ప్రారంభించిన రెనోవా బన్ను హాస్పిటల్స్ రోగులకు అత్యాధునిక వైద్య సేవలను అందించడంలో ముందజలో ఉంటుందని ప్రేమతో, ఆప్యాయతతో, లాభాపేక్ష ఎక్కువగా లేకుండా, సరైన నైతికతో నిర్వహిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ రొమ్ము క్యాన్సర్ పైన అవగాహనా కలిపించటం కోసం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాలని అంతేకాకుండా ఆరోగ్య శ్రీ సేవల ద్వారా వరంగల్ పేద ప్రజలకి మెరుగైన వైద్య సేవలను అందించాలని రెనోవా యాజమాన్యనికి తెలిపారు.
అనంతరం రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఫౌండర్,సీఈఓ శ్రీధర్ పెద్దిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ లో రెండవ పెద్ద నగరమైన వరంగల్ ప్రాంతంలో మొట్ట మొదటి సమగ్రమైన క్యాన్సర్ హాస్పిటల్ గా రెనోవా బన్ను హాస్పిటల్స్ నిలుస్తుందని తెలిపారు. కేవలం వరంగల్ నగర వాసులకే కాకుండా జిల్లాలోని పలు ప్రాంతాల వారికి కూడా ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయని వివరించారు. గతంలో నాణ్యమైన క్యాన్సర్ చికిత్సకు హైదరాబాద్ కు వెళ్లాల్సి వచ్చేదని అయితే ప్రస్తుతం వారి ముంగిట్లో నే ప్రపంచ స్థాయి చికిత్స అందించడానికి రెనోవా బన్ను హాస్పిటల్స్ వారు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డా.అలేటి రవీందర్ రెడ్డి,డా.వినోద్ కుమార్ దుస్సా,డా.వై. విష్ణు వర్ధన్ రెడ్డి, శ్రీధర్ పెద్దిరెడ్డి,డాక్టర్ వీరమల్ల చరణ్ జిత్ రెడ్డి, డా. రాజేష్ బొల్లం ఇతర వైద్య నిపుణులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.






