మేడిపల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా జలంధర్ రెడ్డి బాధ్యతలు
20-06-2026 12:00 AM
మేడిపల్లి, జూన్ 19 (విజయక్రాంతి) : మల్కాజిరి కమిషనరేట్ పరిధిలో మేడిప ల్లి పోలీస్ స్టేషన్ కు నూతన సర్కిల్ ఇన్స్ పెక్టర్‌గా జలంధర్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడ ఇప్పటి వరకు విధులు నిర్వహించిన చింత శంకరయ్య హిమాయత్ నగర్ పోలీస్ స్టేషన్కు బదిలీపై వెళ్ళారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం జలంధర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉండేలా పోలీసింగ్ నిర్వహిస్తానని, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధా న్యత ఇస్తామని తెలిపారు. నేరాల నియంత్రణ, ప్రజా సమస్యల పై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.






