20 June, 2026 | 2:38 AM

సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో యోగా దినోత్సవం

20-06-2026 12:00 AM

ఏర్పాట్లను పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

సికింద్రాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత. అతి ప్రాచీనమైన యో గాను ప్రపంచానికి పరిచయం చేశారు అన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.ఈ సందర్భం గా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం గా ప్రకటించింది.సుమారు 200 దేశాల్లో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ఆయా దేశాల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఎంబసీలులో కూడా యోగా డేను నిర్వహిస్తున్నారు.హైదరాబాద్లో కూడా గత ఐదారు ఏళ్లుగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరిం చుకుని 24 గంటల కౌంట్ డౌన్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.

హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ఉన్న జిల్లా ల్లో యోగా ఆర్గనైజేషన్స్, యోగా ఇన్స్ట్రక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నా రు. అలాగే ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల ల్లో టీచర్లు విద్యార్థులు యోగ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇతర సామా జిక సంస్థలు కూడా ఒక సామాజిక కార్యక్రమంగా యోగ దినోత్సవం అని నిర్వ హిస్తున్నాయి. నేడు జరిగే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గవర్నర్ ,మాజీ ఉపరాష్ట్రపతి వస్తున్నారు. రాజకీయ ప్రతినిధు లు, సినీ ప్రముఖులు హాజరవుతున్నారు. నేడుఉదయం తెల్లవారుజామున 5:30 గంటలకు జరిగే కౌంట్ డౌన్ కార్యక్రమంలో హైదరాబాద్ ప్రజలు పాల్గొనా లని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కోరారు.