జనజాతరను విజయవంతం చేయాలి
01-05-2024 12:28 AM
నియోజకవర్గ ఇన్‌చార్జి అజ్మీరా
కుమ్రంభీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): ఆసిఫాబాద్‌లో ఈ నెల 2న జరిగే సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యే జనజాతర సభను విజయవంతం చేయాలని కాం గ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి అజ్మీరా శ్యామ్‌నాయక్ పిలుపునిచ్చారు. మంగళవారం తన నివాసంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో శ్యామ్‌నాయక్ మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్ సమీపంలోని నిర్వహిస్తున్న జన జాతర మహ సభకు సీఎం రేవంత్‌రెడ్డితోపాటు ఇన్‌చార్జి మంత్రి సీతక్క, కాంగ్రెస్ రాష్ట్ర బాధ్యులు హాజరవుతారని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.




