13 April, 2026 | 3:01 PM

ఓయూలో సమస్యలు పరిష్కరించాలి

01-05-2024 12:30 AM

ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ

హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): ఉస్మానియా వర్సిటీలో మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ౧౦ రోజులుగా విద్యార్థి నుల వసతి గృహాల్లో నీటి కొరత తీవ్రంగా ఉన్నా పట్టించుకోలేదని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ ఆరోపించింది. తక్షణమే అధికారులు చర్యలు తీసుకొని సమ స్య పరిష్కరించాలని మంగళవారం డిమాండ్ చేశారు. అనేకసార్లు నాణ్యమైన భోజనం, తాగునీరు అందిం చాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం చూపడం లేదని ఆరోపిం చారు. సికింద్రాబాద్ పీజీ కాలేజీ, కోఠి ఉమెన్స్ కాలేజీలో కూడా విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.