చేప చర్మంతో కాలిన గాయాలకు చికిత్స
01-05-2024 12:27 AM
హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): చేప చర్మాన్ని కాలిన గాయాలపై ప్రయోగించినప్పుడు మంచి ఫలితాలు ఇస్తుందని ప్రముఖ పాడియాట్రిక్ నిపుణుడు సంతోష్ మూర్తి తెలిపారు. కాలిన రోగులకు చేప చర్మంతో గ్రాఫ్టింగ్‌ని ఉపయోగిస్తున్న మొదటి సర్జన్ ఆయన. మంగళవారం లక్నోలో జరిగిన కాన్ఫరెన్స్ వుండ్ కేర్‌కాన్ 2024లో పాల్గొని ప్రసంగించారు. ఖరీదైన అంటు కట్టడం ప్రక్రియకు ప్రత్యామ్నాయంగా చేప చర్మంతో తక్కువ ఖరీదుతో గాయాలకు చికిత్స చేస్తున్నట్లు పేర్కొన్నారు.




