15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

బీఆర్‌ఎస్‌లో చేరిన జంగంపేట కాంగ్రెస్ నేత

27-02-2026 12:52 AM

పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే జిఎంఆర్ 

పటాన్‌చెరు, ఫిబ్రవరి 26: రాష్ట్ర ప్రజలందరూ తిరిగి తెలంగాణ తొలి ముఖ్య మంత్రి కెసిఆర్ పాలనను కోరుకుంటున్నారని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జిన్నారం ము న్సిపల్ పరిధిలోని జంగంపేటకు చెందిన కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ కుమ్మరి రాంబాబు గురువారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో.. ఎమ్మెల్యే జిఎంఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదం.. కార్యకర్తల కృషితో నియోజకవర్గ పరిధిలోని ఐదు మున్సిపాలిటీలలో బిఆర్‌ఎస్ జెండా ఎగర వేసామని అన్నారు. ప్రతి మున్సిపాలిటీనీ అభివృద్ధి పథంలో తీసుకొని పోవడమే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, రాజేష్, గంగా రెడ్డి, శంకర్, శ్రీకాంత్ గౌడ్, వెంకట్ రెడ్డి, మధు, దుర్గేశ్, శ్రీనివాస్ రెడ్డి, నర్సింగ్ రావు, శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.