17 April, 2026 | 2:44 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

అంగన్‌వాడీ కార్యకర్తలు సమయపాలన పాటించాలి

27-02-2026 12:52 AM

ములకలపల్లి, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి):ప్రభుత్వం నిర్దేశించిన వేళలను అంగన్వాడీ కార్యకర్తలు కచ్చితంగా పాటించాలని పాత గంగారం సర్పంచ్ సోడే చైతన్య సూచించారు.గురువారం పాత గంగారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీలోని అంగన్వాడీ కార్యకర్తలందరూ సమయపాలన పాటించాలని తెలిపారు.

అంగన్వాడీ కేంద్రానికి చిన్న పిల్లల కొరకు సరఫరా చేస్తున్న కోడిగుడ్లు, పాల పాకెట్లు, పప్పు,బియ్యం తినుబండరాలు వంటివి నాణ్యంగా ఉన్నాయా? లేవా? అని పరిశీలించారు.ప్రభుత్వం సరఫరా చేస్తున్న వీటిని సక్రమంగా వినియోగించి చిన్న పిల్లలకి, గర్భిణీ లకు, బాలింతలకు వచ్చే రక్త హీనతను తగ్గించాలని ఈ సందర్బంగా అక్కడకు మీటింగ్ కు వచ్చిన అంగన్వాడీ టీచర్లకు అందరికీ సూచించారు.చిన్న పిల్లలు ప్రీ స్కూల్ కు వెళ్ళటానికి ముందే వారికి అన్ని పదాలు రాయడం, పలకటం వచ్చేలా అంగన్వాడి కార్యకర్తలు కృషి చేయాలని చెప్పారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి సురేష్ ఉన్నారు.